వరికుంటపాడు మండలంలోని తోటల చెరువు పల్లి గ్రామంలో శనివారం మండల వైద్యాధికారిని ఆయేషా ఆధ్వర్యంలో 104 వాహనం ద్వారా వైద్య సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 33 మందిని పరీక్షించి వారికి ఉచితంగా మందులు అందజేశారు. గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆమె తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.