ప్రస్తుత ఇంజనీర్లకు సవాలుగా ఆనాటి కట్టడాలు చెక్కుచెదరకుండా నేటికీ దర్శనమిస్తున్నాయి. 600 సంవత్సరాల క్రితం నెల్లూరు జిల్లా ఉదయగిరిని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్న కాలంలో దుర్గానికి ఈశాన్యంలో ఏనుగులు, గుర్రాళ్ళు నీరు తాగేందుకు ఓ కట్టను నిర్మించారు. దానిని గండిపాలెం చెరువుగా పిలుస్తారు. కట్టకు రెండు వైపులా రాతితో రెండు తూములను నిర్మించారు. అవి నేటికీ చెక్కుచెదరక దర్శనమిస్తున్నాయి.