నెల్లూరు జిల్లా వరికుంటపాడు విరువూరు నూతన వీఆర్వోగా కొండా శ్రీను నియమితులయ్యారు. బుధవారం ఆయన తహసిల్దార్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయం సిబ్బంది, పలువురు ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవిన్యూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రెవెన్యూ సమస్యలపై ప్రజలు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.