ఉదయగిరి మేజర్ పంచాయతీలో శుక్రవారం సర్పంచ్ పావులూరు సామ్రాజ్యం, ఉప సర్పంచ్ షేక్ ముత్తుజ హుస్సేన్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి కరిముల్లా వేలం పాటలు నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ. పంచాయతీ బస్టాండ్లోని వాహనాలు, మాంసం దుకాణాలు, కూరగాయల దుకాణాలు రోజువారి రుసుం రూ. 10 లక్షల 12 వేలకు షేక్. ఖలీద్ దక్కించుకున్నట్లు ఆయన తెలిపారు.