నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ స్థానిక మురుగన్ షోరూం నాలుగు రోడ్ల సెంటర్ వద్ద వాహనదారులు ఏమాత్రం ఆదమరిచిన గాయాలపాలవుతున్నారు. ఈ సర్కిల్ లో ప్రమాదకరంగా గొయ్యి ఏర్పడింది. గత మూడు రోజులుగా వర్షాలు పడుతుండడంతో ఈ గుంటలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో వాహనదారులు ఆదమరిస్తే గుంటలో పడి గాయపడుతున్నారు. రాత్రి వేళల్లో మరింత ప్రమాదకరంగా ఉంది. అధికారులు తక్షణం స్పందించాలని పలువురు కోరుతున్నారు.