సినీ ఆర్టిస్ట్, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిపై నెల్లూరు జిల్లా కావలి డిఎస్పీ శ్రీధర్ కు కావలి టిడిపి నేతలు గురువారం ఫిర్యాదు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి. ఆర్ నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణ మురళి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాజంలో గౌరవ మర్యాదలతో ఉన్న బి. ఆర్ నాయుడు పై వ్యక్తిగత దూషణ చేసిన పోసాని వ్యాఖ్యల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు.