కందుకూరు టిడిపి కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుకూరు నియోజకవర్గంలో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులను బాధితులకు పంపిణీ చేయడం జరిగింది. గత వైసిపి ప్రభుత్వంలో పేదల ఆరోగ్య విషయంలో పూర్తిగా విస్మరించిందని, గత ప్రభుత్వంలో ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు కూడా అంతంతమాత్రంగా ఉండేవని విమర్శించారు.