గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వెల్లడించారు. 57వ జాతీయ గ్రంథాలయాల వారోత్సవాలు ఒంగోలులోని జిల్లా సంస్థ కార్యాలయంలో కార్యదర్శి ఆదిలక్ష్మి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్, నగర మేయర్ గంగాడ సుజాత ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ముందుగా కలెక్టర్ సరస్వతి దేవి విగ్రహానికి పూలమాలలు వేసి, పుస్తక ప్రదర్శన ప్రారంభించారు.