గ్రామ వార్డు సచివాలయాల వద్ద ఆందోళనకు సంబంధించిన గోడపత్రికలను సిపిఐ నాయకులు ఆదివారం ఆవిష్కరించారు. సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 18న ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా ఆ పార్టీ నాయకులు వెంకటేశ్వరరావు తెలిపారు. ఒంగోలులోని సిపిఐ కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడుతూ టిడ్కొ ఇళ్లు, ఇళ్లు లేని పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు.