ఒంగోలులో మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరుతో మైనార్టీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సైదా తెలిపారు. మౌలానా అబుల్ కలాం 136వ జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి సోమవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మౌలానా అబుల్ కలాం గొప్ప దేశభక్తుడని, మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారని, వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని వారికి ఆదర్శంగా నిలవాలని తెలిపారు.