ఒంగోలులోని బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో వారం రోజులపాటు కర్మయోగి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ కు సంబందించి గ్రూప్-1, గ్రూప్-2 అధికారులకు బిహేవియర్ ట్రైనింగ్ ఇచ్చారు. యుజర్లతో ఏ విధంగా మాట్లాడాలన్న దానిపై ట్రైనింగ్ జరిగింది. శనివారం ట్రైనింగ్ ముగించుకున్న బిఎస్ఎన్ఎల్ అధికారి నున్న నాగేశ్వరరావు ఏజీఎం చేతుల మీదుగా ట్రైనింగ్ కంప్లీట్ సర్టిఫికెట్ను అందుకున్నారు. పలువురు ఆయనను అభినందించారు.