15 రోజులు మృత్యువుతో పోరాడి పొదిలికి చెందిన అనిల్ కుమార్ ఆదివారం మృతి చెందాడు. పట్టణంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో అనిల్ కుమార్ 15 రోజుల క్రితం తీవ్రంగా గాయపడ్డాడు. మొదట ఒంగోలు లోని ఓ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న అనిల్ మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.