స్ధానిక మార్కాపురం పట్టణం లోని తర్లుపాడు రోడ్డులో సువిశాలమైన 18 ఎకరాల ప్రాంగణంలో అత్యున్నత విద్యా ప్రమాణాలు మరియు అన్ని మౌళిక వసతులతో ఏర్పాటు చేసిన కమలా CBSE పాఠశాలకు 2022—23 విద్యా సంవత్సరం నుంచి CBSE న్యూ ఢిల్లీ అఫిలియేషన్ అధారిటీ వారిచే అఫిలియేషన్ నెంబర్ 130707 గుర్తింపు పొందినట్లు , పశ్చిమ ప్రకాశంలో గుర్తింపు పొందిన ఏకైక విద్యా సంస్ధ కమలా CBSE పాఠశాల మాత్రమే అని కమలా విద్యా సంస్ధల సెక్రటరీ&కరెస్పాండెంట్ పెనుగొండ పవన్ కుమార్ ఒక ప్రకటనలో తెలియచేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశాన్ని విద్యలో అత్యున్నత శిఖరాలకు తీసుకు వెళ్ళాలనే ధ్యెయంతో కమలా హైస్కూలు, జూనియర్ కళాశాల , డి. యడ్ , బి. యడ్ , MBA, TPT కళాశాలలను ఏర్పాటు చెయడం జరిగింది. దానిలో భాగంగా నే CBSE పాఠశాలను ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభిస్తున్నట్లు , తెలియచేసారు.