శ్రీ శోభకృత నామ సంవత్సరాది సందర్భంగా కనిగిరి నియోజకవర్గ ప్రజలకు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ మంగళవారం ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ.. "ఉగాది" మన తెలుగు వారికి ప్రీతిపాత్రమైన పండుగ "ఉగాదితోనే మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందన్నారు. అలానే సంక్రాంతి నాటికి పంట చేతికి వస్తే ఉగాదితో వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయన్నారు. ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలు ఆరోగ్యం ఆనందంతో పాటు సిరిసంపదలను ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్టు అయన తెలియజేశారు.