కనిగిరిలో డ్రైనేజీ సమస్య లేకుండా పరిష్కరించడానికి కృషి చేస్తామని మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ తెలిపారు. కనిగిరి పట్టణంలో శివాజీ నగర్ కాలనీ శివారు ప్రాంతంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు రహదారులపై ప్రవహిస్తూ ఉండటంతో సమాచారం అందుకున్న మున్సిపల్ చైర్మన్ పారిశుద్ధ్య సిబ్బందిచే శుక్రవారం డ్రైనేజీ కాలువలను శుభ్రం చేపించారు. నూతన సిమెంట్ కాలువలను నిర్మించి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.