చంద్రశేఖరపురం మండల పరిధిలో శైవ క్షేత్రమైన భైరవకోనలో ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి చెందిన డీఎస్పీ లక్ష్మణ కుమార్ ఆదివారం తన కుటుంబంతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ భైరవేశ్వర స్వామి, ప్రముఖ దుర్గాదేవికి పూజలు చేశారు. ఆలయ అధికారులు డీఎస్పీని ఘనంగా సన్మానించి ప్రసాదాలను అందజేశారు. కార్తిక మాసంలో ఆలయంలో చేపడుతున్న కార్యక్రమాల వివరాలను అధికారులు ఈ సందర్భంగా డి ఎస్పీకి తెలిపారు.