గ్రామ స్థాయి నుండి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలని కనిగిరి నియోజకవర్గం బిజెపి కన్వీనర్ కోనిశెట్టి వెంకటరమణయ్య తెలిపారు. బిజెపి మండల అధ్యక్షులు సత్యం ఆధ్వర్యంలో సిఎస్ పురంలో ఆ పార్టీ సర్వసభ్య సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ త్వరలో పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేసి బిజెపిని బలోపేతం చేయాలన్నారు.