మార్కాపురం: మంట కలిసిన మానవత్వం
మార్కాపురంలో మానవత్వం మంట కలిసింది. పట్టణంలోని కంభం సెంటర్ సమీపంలో ఉన్న డ్రైనేజీ కాలువలో 4 నెలల మృత పిండాన్ని డ్రైనేజీ కాలవను శుభ్రం చేస్తుండగా మున్సిపల్ కార్మికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత పిండాన్ని పరిశీలించారు. ఉద్దేశపూర్వకంగా ఎవరో పిండాన్ని కాలవలో పడేది వేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.