కంభం: మట్టి మాఫియా కు చెక్ పెట్టిన పోలీసులు
కంభం మండలం సైదాపురం గ్రామ సమీపంలోని కొండ ప్రాంతంలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మట్టి మాఫియాను నిలువరించారు. తర్వాత మైనింగ్ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అధికారులు మట్టి మాఫియా కు చెందిన ఐదు ట్రాక్టర్లు, ఒక జెసిబి ని సీజ్ చేశారు. అనంతరం వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.