ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో మద్యం బెల్ట్ షాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని ఎస్ఐ నరసింహారావు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 16 క్వాటర్ల మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు. బెల్ట్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశామని నరసింహరావు చెప్పారు. అక్రమంగా మద్యం తరలించడం లేదా మద్యం బెల్టు షాపులు నిర్వహించడం చట్టరీత్య నేరమని ఎస్సై నరసింహారావు హెచ్చరించారు.