గిద్దలూరులో లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో సోమవారం ఎల్ఐసి ఏజెంట్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పాలసీల మీద జిఎస్టిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలసీల మీద బోనస్ లు పెంచాలని ఏజెంట్లకు కమిషన్లు యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ నర్సిరెడ్డి, సెక్రటరీ రామకృష్ణయ్య, ట్రెజర్ ఆళ్ళబాబు మరియు ఏజెంట్లు పాల్గొన్నారు.