కంభం పట్టణంలోని విద్యానగర్ 2వ లైన్ లో రోడ్ల వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నామని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్న రోడ్లు వేయలేదని ప్రజలు వాపోతున్నారు. వర్షాలు కురిసిన సమయంలో రోడ్లన్నీ బురదమయంగా మారి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.