ప్రకాశం జిల్లా, గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో సోమవారం డ్రైనేజీ కాలవలకు మరమ్మతులు నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టారు. కమిషనర్ వెంకట దాసు పనులను దగ్గర ఉండి మరి పర్యవేక్షించారు. చాలా కాలంగా డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయకపోవడంతో చెత్త చెదరాలు భారీ మొత్తంలో పేరుకు పోయాయని కమిషనర్ తెలిపారు. పట్టణ అభివృద్ధికి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కమిషనర్ వెంకట దాసు అన్నారు.