ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారిపై రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలకు పాల్పడిన వారికి నోటీసులు ఇచ్చామని కమిషనర్ వెంకట దాసు శనివారం తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఉన్న నేపథ్యంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్వచ్ఛందంగా ఆక్రమణదారులు ఆక్రమణలను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వెంకట దాసు అన్నారు.