దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జ్ గొట్టిపాటి లక్ష్మి దివ్యాంగులకు ట్రై సైకిల్స్ ను శనివారం రాత్రి పంపిణీ చేశారు. ముందుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ జన్మదిన వేడుకలను టిడిపి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం పేద దివ్యాంగులైన నలుగురికి ట్రై సైకిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య, కౌన్సిలర్ విపి రెడ్డి పాల్గొన్నారు.