నవంబర్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పై కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం ఒంగోలు లోనే కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 31వ తేదీన దీపావళి పండుగ కావటంతో సెలవు దినమని, 30వ తేదీన ముందస్తుగానే బ్యాంకుల నుండి నగదును విత్ డ్రా చేసుకోవాలని తెలిపారు. 1వ తేదీన ఉదయం 5 గంటల నుండి లబ్ధిదారులకు సచివాలయాల సిబ్బంది పింఛన్లను పంపిణీ ప్రారంభించాలన్నారు.