అర్హులైన వారు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని ప్రకాశం జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. ఒంగోలులోని కలెక్టర్ లో జాయింట్ కలెక్టర్ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వెంటనే ఒకరోజు వ్యవధిలో సిలిండర్ డెలివరీ అవుతుందన్నారు. డెలివరీ అయిన 48 గంటల్లో ఖాతాకు నగదు జమ అవుతుందన్నారు. లబ్ధిదారులకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు.