తర్లుపాడు: అనారోగ్యంతో సర్పంచ్ మృతి

76பார்த்தது
తర్లుపాడు: అనారోగ్యంతో సర్పంచ్ మృతి
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం మంగళకుంట గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచ్ పిన్నిక శారద మృతి చెందారు. అనారోగ్య కారణాలతో కొద్ది రోజులుగా ఆమె హైదరాబాదులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. శనివారం సర్పంచ్ శారద మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె అంతక్రియలు పూర్తి చేసేందుకు స్వగ్రామానికి తరలిస్తున్నట్లుగా శారద బంధువులు తెలిపారు. సర్పంచ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

தொடர்புடைய செய்தி