మార్కాపురంలోని కోర్టు ఎదుట నిరసన

84பார்த்தது
మార్కాపురంలోని కోర్టు ఎదుట నిరసన
మార్కాపురం కోర్టు ఎదుట శుక్రవారం తమవారిని అన్యాయంగా అరెస్టు చేశారని అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొందరు నిరసన తెలిపారు. పెద్ద దోర్నాల అటవీ ప్రాంతంలో కొద్ది రోజుల క్రితం అలుగును వేటాడారన్న విషయంలో ముగ్గురిని అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. తమ వారిని అన్యాయంగా ఇరికించారని నిందితుల బంధువులు ఆరోపిస్తున్నారు.

தொடர்புடைய செய்தி