కొండేపల్లి రోడ్డులోని వివాదాస్పద స్థలంపై మార్కాపురం డీఎస్పీ నాగరాజు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. సర్వే నంబర్ 343ఎ స్థలం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్లుగా తెలిపారు. ప్రార్థన మందిరాలకు స్థలాన్ని కేటాయించడం లేదని ఈ విషయంపై ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని నాగరాజు అన్నారు. తప్పుడు పుకార్లు పుట్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ప్రజలను హెచ్చరించారు.