మార్కాపురం డివిజన్ లో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం ప్రజలను హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లుగా కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా డివిజన్ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు బయటకు రాకుండా అప్రమత్తంగా ఆమె ఉండాలన్నారు.