ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం బింగినపల్లి గ్రామ చెరువుకు నీరు అందించే సప్లై ఛానల్ కాలువకు శుక్రవారం గండి పడింది. వరదనీరు ఈ సప్లై ఛానల్ కాలువ ద్వారా బింగినపల్లి చెరువుకు వచ్చి చేరుతుంది. కాలువకు గండి పడటంతో స్థానిక రైతులతో పాటు అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడికి చేరుకొని గండిని ఇసుక బస్తాలతో మూసి వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నీరంతా వృధాగా పోతుండడంతో స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.