ప్రకాశం జిల్లా సింగరాయకొండ టోల్ ప్లాజా వద్ద మంగళవారం సీఐ హజారత్తయ్య వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 20 ద్విచక్ర వాహనదారులకు రూ. 15, 300 నగదును జరిమానా విధించారు. ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్లకు సీఐ కౌన్సిలింగ్ ఇచ్చారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సీఐ వాహనదారులకు తెలిపారు.