సింగరాయకొండ మండలం ఊళ్లపాలెంలో వివాహేతర సంబంధానికి భార్య అడ్డొస్తుందని భర్త కత్తితో గొంతు కోసి హతమార్చాడు. వెంకట్రావు అక్టోబర్ 17వ తేదీన భార్యను కత్తితో గొంతు కోసి హతమార్చాడని మృతురాలు లక్ష్మీ తిరుపతమ్మ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిందని విచారణ అనంతరం సీఐ హజరయ్యా సోమవారం వివరాలు తెలిపారు. నిందితుడిని కందుకూరు కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లుగా సీఐ వెల్లడించారు.