వెలిగండ్లలోని పోలీస్ స్టేషన్లో స్థానిక ఎస్సై మధుసూదన్ రావు ఆటో డ్రైవర్లకు ఆదివారం కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జీల కంటే అదనంగా వసూలు చూస్తున్నారని, అలా చేయరాదన్నారు. పరిమితికి మించి ప్యాసింజర్లను ఆటోలో ఎక్కించరాదని సూచించారు. తప్పనిసరిగా లైసెన్స్, ఆటోకి సంబంధించిన పత్రాలు, డ్రెస్ కోడ్ ఉండాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.