కార్తీక మాసం సందర్భంగా శివాలయాలకు వెళ్ళే భక్తులు తగు జాగ్రత్తలు పాటించాలని పామూరు ఎస్సై కిషోర్ బాబు తెలిపారు. పామూరు పోలీసు స్టేషన్ లో ఎస్సై ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కార్తీకమాసం సందర్భంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో బంగారు ఆభరణాలు ధరించకూడదని తెలిపారు. దేవాలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వలన ఆభరణాలను దొంగలించేందుకు అవకాశం ఉంటుందన్నారు. మహిళలు తగు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.