పొగాకుకు ప్రత్యామ్నాయ పంటలను రైతులు సాగు చేసుకోవాలని వ్యవసాయ శాఖ ఏడిఏ వెంకటరమణ తెలిపారు. కనిగిరి మండలం
తాళ్లూరులో పొగాకు రైతులతో వ్యవసాయ శాఖ పొగాకు బోర్డ్ అధికారులు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడిఏ వెంకటరమణ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలలో పొగాకు ఎక్కువ సాగై అమ్మకాలకు సిద్ధంగా ఉందని తెలిపారు. కావున పొగాకుకు ప్రత్యామ్నాయంగా సెనగ, మినుము వంటి పంటలను రైతులు సాగు చేయాలని సూచించారు.