రాచర్ల మండలంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని గిద్దలూరు జూనియర్ సివిల్ జడ్జ్ ఓంకార్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అధికారులు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. తర్వాత విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని జడ్జ్ ఓంకార్ సూచనలు, సలహాలు ఇచ్చారు.