పట్టణంలోని దీపావళి టపాసులను విక్రయిస్తున్న పలు దుకాణాలను మార్కాపురం డి. ఎస్. పి నాగరాజు గురువారం పరిశీలించారు. దుకాణాలను పరిశీలించి దుకాణదారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. అధికారులు జాగ్రత్తలు తీసుకుంటూ ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా వ్యవహరించాలని డిఎస్పి పోలీసు సిబ్బందికి తెలిపారు. నిబంధనలు పాటించకుండా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని డిఎస్పి నాగరాజు అన్నారు.