కంభం మండలంలోని హజరత్ గూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మహబూబ్ పీరా అధ్యక్షతన సోమవారం బాలల గ్రామసభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీ ప్రత్యేక అధికారి, ఎంఈఓ బి.మాల్యాద్రి మాట్లాడుతూ బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా బాలల కోసం ప్రత్యేక గ్రామ సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశ భవితకు బాలల పురోగతే ప్రధానమని, బాల బాలికలు మధ్య అంతరాలను, అసమానతలను అధిగమించి అన్ని రంగాల్లో రాణించాలన్నారు.