రాచర్ల మండలం యడవల్లిలో అక్రమంగా మద్యం బెల్టు షాపు ఏర్పాటు చేసుకొని మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని శనివారం ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 10 క్వాటర్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని సీఐ జయరావు తెలిపారు. మద్యం బెల్టు షాపు నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశామని చెప్పారు. మద్యం బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకొని మద్యం విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తామని సీఐ అన్నారు.