అక్రమంగా మద్యం విక్రయిస్తున్న 14 మద్యం బాటిళ్లను దొనకొండ ఎస్సై విజయ్ కుమార్ స్వాధీనం చేసుకున్నారు. దొనకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం పోలీసులు ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీలలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని ఎస్సై విజయ్ కుమార్ అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు.