కొరిశపాడు: ప్రజలు కాన్సర్ టెస్ట్ లు చేయించుకోవాలి
కొరిశపాడు ప్రాథమిక వైద్యశాల పరిధిలోని ప్రజలందరూ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లు చేయించుకోవాలని మండల వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ శుక్రవారం తెలియజేశారు. తమ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటి వద్దకు వచ్చి స్క్రీనింగ్ టెస్టులు చేస్తారని ఆయన చెప్పారు. కావున ప్రజలందరూ తమ సిబ్బందికి సహకరించాలని డాక్టర్ రాజ శేఖర్ కోరారు.