అద్దంకి పట్టణంలోని భవాని సెంటర్ నందు బుధవారం రాత్రి ఎస్సై ఖాదర్ భాషా వాహనాలు తనిఖీ చేశారు. ప్రయాణికుల నుంచి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కారులో ప్రయాణించే వారు సీట్ బెల్టు, ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలని ఎస్సై వారికి సూచించారు. ప్రమాదం సమయంలో సీట్ బెల్ట్, హెల్మెట్ రక్షణగా నిలుస్తుందని ఆయన తెలియజేశారు. రోడ్డు భద్రత నిబంధనలను పాటించాలని పేర్కొన్నారు.