ఎస్ కోట మండలం కొట్టాంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ రాజా శనివారం పర్యటించారు. గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలపై సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. క్లోరినేషన్ చేసిన మంచినీరు ప్రజలకు సరఫరా చేయాలని కోరారు. గ్రామాల్లో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలపై నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.