గిరిజనుల అభ్యున్నతికై కృషి చేసి, బ్రిటిష్ అరాచకాలను ఎదిరించిన ఆదివాసీ యోధుడు అని మాజీ ఉప ముఖ్యమంత్రి పి. రాజన్న దొర అన్నారు. ఆయన నివాసంలో శుక్రవారం బిర్సా ముండా జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూల మాలవేసి నివాళి అర్పించారు. తన పోరాట పటిమతో ఆంగ్లేయులకు చెమటలు పట్టించి, చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించిన గిరిజన నాయకుడు, స్వాతంత్ర్య సమర ఆదివాసీ యోధుడు భగవాన్ బిర్సాముండా అన్నారు.