తమ డిమాండ్లు పరిష్కరించాలని తెర్లం ఎంపీటీసీ ఆనంద రావుకి 104 సిబ్బంది మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఉద్యోగులు మాట్లాడుతూ తమకి నెల నెల సక్రమంగా జీతాలు చెల్లించక కుటుంబాలను పోషించటం చాలా కష్టం అవుతుంది అని వాపోయారు. వారి సమస్యలు ఇతర బకాయిలు చెల్లించే విదంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉద్యోగులకు న్యాయం చెయ్యాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 104 ఉద్యోగులు డ్రైవర్ రమేష్, డిఇఓ కిరణ్ కుమార్ పాల్గొనడం జరిగింది.