తుఫాను హెచ్చరికల దృశ్య కురుపాం తహశీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తహశీల్దార్ ఎం.రమణమ్మ శనివారం తెలిపారు రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను కోరారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే తక్షణమే కార్యలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ కు ఫోన్ చేయాలన్నారు.