కురుపాం మండలం కొత్తూరు గ్రామంలో పొలంబడి కార్యక్రమాన్ని వ్యవసాయశాఖ అధికారులు గురువారం నిర్వహించారు. వరి వేసిన పొలంలో శత్రు పురుగులు, మిత్ర పురుగులు సంఖ్యబలం తెలుసుకోవడంపై రైతులకు అవగాహన కల్పించారు. పొలం గట్లు మీద బంతి, కంది నాటడం, రంగు పళ్ళాలు, లింగాకర్షక బుట్టలు వేయించడం, కషాయాలు తయారి చేయించడం, పక్షి స్థావరాలు వేయించడం వలన రైతులు మంచి దిగుబడులు ఆశించగలరని అధికారులు తెలిపారు.