మన్యం జిల్లాలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థుల మృతిపట్ల రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థుల మృతికి గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మన్యం జిల్లా కలెక్టర్ ను కోరారు. మన్యం జిల్లాలో జియ్యమ్మవలస మండలం రావాడ రామభద్రపురు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థితో పాటు, కురుపాం పాఠశాల విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందిన సమాచారం తెలుసుకున్నారు.